సోమవారం, 20 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 జనవరి 2025 (11:17 IST)

Rajasthan: టీచర్‌తో రాసలీలల్లో మునిగిపోయిన ప్రిన్సిపాల్.. వీడియో వైరల్

Teacher
Teacher
ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలతో పాటు.. జీవిత పాఠాలు నేర్పిస్తారు. ప్రస్తుతం ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో స్కూల్‌లో ప్రిన్సిపాల్.. టీచర్‌తో రాసలీలల్లో మునిగిపోయాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 
 
గంగ్రార్ బ్లాక్‌లో ఉన్న సలేరాలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో జరిగిన ఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది. పాఠశాలలో ప్రిన్సిపాల్, టీచర్‌తో రొమాన్స్ చేశాడు. ముద్దులు పెట్టుకుంటూ, జుగుప్సాకరంగా వ్యవహరించారు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. 
 
పాఠశాల స్టాఫ్‌ రూము ఈ వికృతానికి కేంద్రంగా మారింది. విద్యాశాఖ ఇద్దర్ని సస్పెండ్ చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.