బుధవారం, 15 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 జనవరి 2025 (17:18 IST)

Samosa: సమోసా తిందామని చూస్తే బ్లేడ్.. షాకైన హోంగార్డు.. ఎక్కడంటే?

Blade in Samosa
Blade in Samosa
రాజస్థాన్‌లోని టోంక్‌లోని నివాయ్ పట్టణంలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తికి తినే సమోసాలో బ్లేడ్ కనిపించింది. స్నాక్స్ తినడానికి రమేష్ రోడ్డు పక్కన ఉన్న స్నాక్స్ స్టాల్‌కి వెళ్ళినప్పుడు, తన సమోసాలో పదునైన బ్లేడ్ వుండటం చూసి షాక్ అయ్యాడు. 
 
వర్మ తినే సమోసాలో బ్లేడ్ వుండటాన్ని గమనించి రికార్డ్ చేస్తున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇది నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. వర్మ, హోంగార్డు అని తెలిసింది. 
 
రాజస్థాన్‌లోని జైన్ నామ్‌కీన్ భండార్ అనే స్టాల్ నుండి కచోరి, మిర్చి బడే, సమోసాలను కొనుగోలు చేశాడు. ఇందులో సమోసాలో బ్లేడ్‌ను చూసి షాకయ్యాడు. ఇది చివరికి ఆందోళనకరమైన విషయంగా మారింది. 
 
"నేను ఇంట్లో తిందామని సమోసా విరుస్తున్నప్పుడు, లోపల బ్లేడ్ ముక్క కనిపించింది" అని వర్మ మీడియాతో తెలిపాడు. దీనిపై పోలీసులకు, ఆహార శాఖకు సమాచారం ఇచ్చానని పేర్కొన్నాడు.
 
వర్మ మొదట దుకాణదారుడిని సంప్రదించి అతనికి వడ్డించిన సమోసాలో బ్లేడ్ వుండటంపై ప్రశ్నించాడు. అయితే, దుకాణాదారుడు ఏమాత్రం పట్టించుకోలేదని తెలిపాడు.