శంతనుకు కీలక పదవి... నా తండ్రిలా నడిచొచ్చే రోజులు వచ్చాయ్...
దివంగత దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా స్నేహితుడు శంతను నాయుడుకు టాటా మోటార్స్ కంపెనీ కీలక పదవిని ఆఫర్ చేసింది. రతన్ టాటా చివరి దశలో కే టేకర్‌గా శంతను నాయుడు వ్యవహరించిన విషయం తెల్సిందే. ఇపుడు ఆయనను టాటా మోటార్స్‌లో స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్‌కు జనరల్ మేనేజరుగా నియమించింది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ శంతను లింక్డిన్లో పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. టాటా మోటార్స్ ప్లాంట్ నుంచి తెలుగు రంగు చొక్కా, నేవీ బ్లూ ప్యాంట్లో తన తండ్రి నడుచుకుంటూ ఇంటికి వచ్చేవారని, ఆ సమయంలో తాను ఆయన కోసం ఎదురు చూస్తూ కిటికీలో నుండి చూసేవాడినని శంతను పేర్కొన్నాడు. ఇపుడు నేను కూడా అలా నడిచొచ్చే రోజులు వచ్చాయని దాసుకొచ్చారు.
కాగా, టాటా ట్రస్ట్‌లో పిన్న వయస్కుడైన శంతను 2018 నుంచి రతన్ టాటాకు అసిస్టెంట్‌గా వ్యవహరించిచన విషయం తెల్సిందే. వీరిద్దరికీ మంచి అనుబంధం ఏర్పడింది.