సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 14 నవంబరు 2023 (11:51 IST)

32 యేళ్ల వైవాహిక బంధానికి తెగదెంపులు చేసుకున్న పారిశ్రామికవేత్త

Gautam Singhania
దేశంలోని ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాల్లో ఒకరిగా ఉన్న రేమండ్స్ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానికి తన భార్య నవాజ్‌ నుంచి విడిపోతున్నట్టు ప్రకటించారు. దీంతో వారి 32 యేళ్ల వైవాహిక బంధానికి ముగింపు కార్డు పడనుంది. నిజానికి వీరిద్దరూ విడిపోతున్నట్టు గత కొంతకాలంగా విస్తృతంగా ప్రచారం సాగుతుంది. ఈ వార్తలను నిజం గౌతమ్ సింఘానియా నిజం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. 
 
రూ.11,000 కోట్ల నికర సంపద ఉన్న సింఘానియాకు, ఫిట్నెస్ ట్రైనర్ అయిన నవాజ్ అనుబంధం ఏర్పడి 32 ఏళ్లు కాగా, 1999లో పెళ్లి అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత వారం థానేలో సింఘానియా నిర్వహించిన దీపావళి ముందస్తు పార్టీకి ఆహ్వానం ఉన్నా కూడా నవాజ్‌ను అనుమతించలేన్న విషయాన్ని స్పష్టం చేసే ఒక వీడియో వైరల్ అయిన నిమిషాల వ్యవధిలోనే ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. 
 
'ఇన్నేళ్లుగా ఒక నిబద్ధత, విశ్వాసంతో కలిసి పయనించాం. మా జీవితాలకు అందమైన రెండు అద్భుతాలు జతయ్యాయి. అయితే ఇటీవలికాలంలో కొన్ని దురదృష్టకర పరిణామాలు చోటుచేసుకున్నాయి. కానీ నిరాధార ఊహాగానాలను ఎక్కువ మంది వ్యాపింపజేశారు. బహుశా వాళ్లు మా శ్రేయోభిలాషులు కారేమోనని సింఘానియా పేర్కొన్నారు. ఇకపై నవాజ్, తాను వేర్వేరు దారులను అన్వేషించగలమని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే పిల్లలిద్దరికీ అత్యుత్తమ జీవితాన్ని ఇవ్వడానికి ఇద్దరమూ కట్టుబడి ఉంటామని అన్నారు. విడిపోవడానికి కారణాలను కానీ, పిల్లల బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారన్న వివరాలపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. వ్యక్తిగత నిర్ణయాలకు గౌరవం ఇవ్వాలని పేర్కొన్నారు.