1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2023 (22:01 IST)

కెమెరాకు అడ్డు వచ్చాడని చేయి చేసుకున్న మంచు లక్ష్మి

manchu laxmi
manchu laxmi
సినీ నటి మంచు లక్ష్మికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. దీనిలో లైవ్‌లో ఒక వ్యక్తి మీద చేయి చేసుకున్నారు మంచు లక్ష్మి. ఇటీవల దుబాయ్ వేదికగా సైమా అవార్డ్స్ వేడుక జరిగింది. ఆ వేడుకలో మంచు లక్ష్మీ ప్రవర్తించిన తీరు పట్ల ట్రోల్స్ మొదలైయ్యాయి.
 
ఈ సైమా వేడుకలో మంచు లక్ష్మీ మాట్లాడుతుండగా.. ఓ వ్యక్తి కెమెరాకు అడ్డుగా వచ్చారు. దీంతో ఆమెకు కోపం వచ్చింది. ముందుగా ఓ వ్యక్తి అడ్డురాగా అతనిపై భుజంపై తట్టారు. అంతేగాకుండా ఆ వ్యక్తిని పట్టుకుని తిట్టారు. 
 
ఇంతలో మరో వ్యక్తి అడ్డు రావడంతో హలో కెమెరా వెనుక నుంచి వెళ్లాలి డ్యూడ్.. మినిమం బేసిక్‌.. లేదా అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.