ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 9 ఏప్రియల్ 2017 (11:59 IST)

రామమందిరం కోసం ఉరేసుకుంటా : కేంద్ర మంత్రి ఉమాభారతి సంచలనం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి చేయాలన్నదే కోట్లాది మంది హిందూ ప్రజల అభిప్రాయమని కేంద్ర మంత్రి ఉమాభారతి అన్నారు. శనివారంనాడు ఆమె ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ను కలిశ

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి చేయాలన్నదే కోట్లాది మంది హిందూ ప్రజల అభిప్రాయమని కేంద్ర మంత్రి ఉమాభారతి అన్నారు. శనివారంనాడు ఆమె ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆమె లక్నోలో మాట్లాడుతూ.. రామమందిరం విశ్వాసానికి సంబందించిన అంశమని, మందిరం కోసం తాను జైలుకు వెళ్ళేందుకు కూడ సిద్ధమని ప్రకటించారు. 
 
ముఖ్యంగా.. రామ మందిరం అనేది కోట్లాది మంది హిందూ ప్రజల విశ్వాసానికి సంబంధించిన అంశమన్నారు. అయితే దానిపై తనకెంతో గౌరవం ఉందన్నారు. రామమందిరంపై చర్చించాల్సిందేమీ లేదన్నారు. ఈ అంశం తమకేమీ కొత్త కాదన్నారు. రామమందిరం ఉద్యమానికి ఆదిత్యనాథ్ గురువు మహంత్ ఆవైద్యనాథ్ నాయకుడు అన్నారు.