గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 8 జనవరి 2021 (12:54 IST)

తగ్గిన పసిడి ధర.. గరిష్ఠ స్థాయికి పెట్రోల్‌ ధర

బంగారం ధర తగ్గుముఖం పట్టింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర గురువారం భారీగా రూ.714 తగ్గి.. రూ.50,335 వద్దకు చేరింది. అంతర్జాతీయంగా బంగారానికి తగ్గిన డిమాండ్​కు అనుగుణంగా దేశీయంగాను పసిడి ధరలు దిగొస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

వెండి ధర కూడా కిలోకు(దిల్లీలో) రూ.386 తగ్గింది. కిలో ధర ప్రస్తుతం రూ.69,708 వద్ద ఉంది.అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,916 డాలర్లకు తగ్గింది. వెండి ఔన్సుకు 27.07 డాలర్ల వద్ద ప్లాట్​గా ఉంది..
 
దేశ చరిత్రలో తొలిసారిగా గరిష్ఠ స్థాయికి పెట్రోల్‌ ధర.దేశ చరిత్రలోనే పెట్రోల్ ధర గరిష్ఠ స్థాయికి చేరింది. గత నెల రోజులుగా పెరగని చమురు ధరలు బుధవారం అకస్మాత్తుగా పెరిగాయి.నిన్న పెట్రోల్‌ లీటర్‌ ధర 26 పైసలు, డీజిల్‌పై 25 పైసలు చొప్పున పెరగ్గా..కంపెనీలు గురువారం మరో 23 పైసలు, డీజిల్‌పై 26 పైసలు పెంచాయి.

దీంతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.84.20 చేరింది.కోల్‌కతాలో రూ.85.68, ముంబైలో రూ.90.83, చెన్నైలో రూ.86.96, బెంగళూరులో 87.04, భువనేశ్వర్‌ రూ.84.68, హైదరాబాద్‌లో 87.59, జైపూర్‌లో రూ.92.17కు చేరింది.ఇదిలా ఉండగా.. డీజిల్‌ ధర ఢిల్లీ లీటర్‌కు 26 పైసలు పెరగ్గా ప్రస్తుతం రూ.74.38కి చేరింది.

కోల్‌కతాలో రూ.77.97, ముంబైలో రూ.81.07, చెన్నైలో రూ.79.72, బెంగళూరులో రూ.78.87, హైదరాబాద్‌లో రూ.81.17, జైపూర్‌లో రూ.84.14కు చేరింది.దేశ చరిత్రలోనే తొలిసారిగా పెట్రోల్ ధర గరిష్ఠ స్థాయికి చేరుకుంది.2018 అక్టోబర్‌ 4న పెట్రోల్‌ రేట్‌ రూ.84 ఉండగా.. ప్రస్తుతం రూ.84.20కు చేరుకుంది.