శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2020 (08:07 IST)

పెరుగుతున్న బంగారం ధర

బంగారం ధర తగ్గినట్టే తగ్గి క్రమంగా మళ్లీ పెరుగుతోంది. ఆగస్టులో అత్యధికంగా రూ.56 వేల మార్కును దాటిన బంగారం ధర క్రమంగా తగ్గుతూ వచ్చి ప్రస్తుతం పసిడి ధరలు ఊగిసలాట ధోరణి కనబరుస్తూ కొద్దికొద్దిగా పెరుగుతున్నాయి.

మంగళవారం బంగారం ధర 454 రూపాయలు పెరిగి రూ. 51,879 కు చేరింది. ఇక కిలో వెండి 117 రూపాయలు భారమై 62,058 రూపాయలకు పెరిగింది.

అంతకుముందు ట్రేడ్‌లో వెండి ధర కిలో రూ .62,376 నుంచి రూ .751 పెరిగి 63,127 రూపాయలకు చేరుకుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గడం వల్లే ఢిల్లీలో 24 క్యారెట్ల స్పాట్‌ బంగారం ధర 454 రూపాయలు పెరిగింది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఔన్స్‌కు 1910 డాలర్లకు తగ్గాయి.