శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 7 ఆగస్టు 2020 (16:50 IST)

ఆకాశాన్నంటిన బంగారం ధర

బంగారం ధర శుక్రవారం ఆకాశాన్నంటింది. మునుపెన్నడూ లేనంత స్థాయిలో పసిడి ధర పెరిగింది. 10 గ్రాముల మేలిమి బంగారం (24 క్యారెట్ల) ధర శుక్రవారం 58,330 రూపాయలకు చేరింది.

రెండు రోజుల వ్యవధిలో బంగారం ధర వెయ్యి రూపాయలు పెరగడం గమనార్హం. వారం వ్యవధిలో బంగారం ధర మూడుసార్లు పెరిగింది. రోజుకు రూ.800 నుంచి 1000 రూపాయల మధ్య పెరుగుతోంది.

బంగారం ధర గరిష్ట స్థాయిలో రూ.65,000 వరకూ పెరగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కిలో వెండి ధర 78,300 రూపాయలకు చేరుకుంది.

బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పైపైకి ఎగబాకుతున్నాయి. డాలర్‌తో రూపాయి విలువ క్షీణించడం ఇందుకు కారణమైందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలన్నాయి.