శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 జూన్ 2023 (11:04 IST)

రూ.1720 కోట్ల వంతెన కూలిపోయింది... గంగలో కలిసిపోయింది..

Bihar
Bihar
బీహార్‌లో రూ.1710 కోట్లతో నిర్మిస్తున్న వంతెన కుప్పకూలింది. బీహార్ రాష్ట్రంలోని భాగల్‌పూర్, ఖగారియా రెండు జిల్లాలను కలుపుతూ గంగా నదిపై నిర్మిస్తున్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. 
 
ఈ వంతెనను 2014లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రారంభించారు. ఈ వంతెనను రూ.1710 కోట్లతో 100 అడుగుల ఎత్తులో మూడు కిలోమీటర్ల పొడవునా నాలుగు లైన్ల వంతెనగా నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. 
 
గత ఏడాది ఏప్రిల్‌లో నిర్మాణ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా వంతెన కూలిపోయింది. ఈ వంతెన రెండోసారి కూలిపోవడంతో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విచారణకు ఆదేశించారు.