సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 18 ఆగస్టు 2017 (14:38 IST)

మనిషా? రాక్షసుడా? విద్యార్థులను ఎలా చావబాదుతున్నాడో చూడండి (Video)

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ రాష్ట్రంలోని అలహాబాద్‌లో ఉన్న రుద్రప్రయాగ్ విద్యా మందిర్ పబ్లిక్ స్కూల్‌లో కొంతమంది విద్యార్థులపై ప్రిన్సిపాల్ తన ప్రతాపం చూపించాడు. పాపం... ఆ

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ రాష్ట్రంలోని అలహాబాద్‌లో ఉన్న రుద్రప్రయాగ్ విద్యా మందిర్ పబ్లిక్ స్కూల్‌లో కొంతమంది విద్యార్థులపై ప్రిన్సిపాల్ తన ప్రతాపం చూపించాడు. పాపం... ఆ విద్యార్థులు ఏం తప్పు చేశారోగానీ, గొడ్డును బాదినట్టు దుడ్డుకర్రతో బాదేశాడు.
 
విద్యార్థులందరినీ వరుసగా నిలబెట్టి ఆ రాక్షసుడు చావబాదుతున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యార్థులను విచక్షణారహితంగా చావబాదిన ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూడండి.