బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 18 జనవరి 2019 (09:02 IST)

జర్నలిస్టు హత్య కేసులో డేరా బాబాకు జీవితశిక్ష

జర్నలిస్టు రామ్ చంద్ర ఛత్రపతి హత్య కేసులో డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబాకు జీవిత కారాగారశిక్ష విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో గుర్మీత్‌తో పాటు మరో ముగ్గురికి కోర్టు జీవిత ఖైదును విధించింది. దీంతోపాటు నలుగురికి రూ.50 వేలు చొప్పున జరిమానా కూడా విధించింది.
 
కాగా, తన ఆశ్రమంలోని ఇద్దరు సన్యాసినులపై అత్యాచారం చేసిన కేసులో గుర్మిత్ రామ్ రహీం సింగ్ ఇప్పటికే రోహతక్ సునరియా జైలులో 20 యేళ్ళ జైలు శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. 
 
ఆశ్రమానికి వెళ్లే మహిళలను డేరా బాబా ఏ విధంగా లైంగిక వేధింపులకు గురిచేసేవాడో పూర్ సచ్ఛ్ న్యూస్ పేపర్‌లో జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి వివరిస్తూ కథనాలను ప్రచురించాడు. ఈ వార్తా ప్రచురణ అనంతరం జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి అక్టోబర్ 2002లో హత్యకు గురయ్యారు. ఈ హత్య వెనుక గుర్మీత్ రామ్ రహీమ్ ఉన్నట్టు సీబీఐ విచారణలో తేలింది. దీంతో కోర్టు ఆయన జీవిత శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది.