శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 16 నవంబరు 2017 (18:34 IST)

పోర్న్ చిత్రాల కోసం క్లిక్ చేస్తే... ఇక హరహర మహదేవ్ ప్రత్యక్షమవుతాడు...

పోర్నోగ్రఫీ సమాజంలో ఎంత దుష్ఫలితాలను సృష్టిస్తుందో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు ఈ పోర్న్ చిత్రాలు చూసి పెడదోవ పడుతుంటారు. అంతేకాదు... ఏదో చదువుకునే సమాచారం కోసం క్లిక్ చేస్తో ఒక్కోసారి నీలి చిత్రాలు దర్శనమిస్తుంటాయి. ఇప్పుడు వీటి బెడదను వద

పోర్నోగ్రఫీ సమాజంలో ఎంత దుష్ఫలితాలను సృష్టిస్తుందో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు ఈ పోర్న్ చిత్రాలు చూసి పెడదోవ పడుతుంటారు. అంతేకాదు... ఏదో చదువుకునే సమాచారం కోసం క్లిక్ చేస్తో ఒక్కోసారి నీలి చిత్రాలు దర్శనమిస్తుంటాయి. ఇప్పుడు వీటి బెడదను వదిలించేందుకు ఓ యాప్ వచ్చేస్తోంది. దానిపేరు ఏమిటో తెలుసా... హరహర మహదేవ్. 
 
ఎవరైనా పోర్న్ చిత్రాలను చూసేందుకు సదరు సైట్లపై క్లిక్ చేస్తే వెంటనే హరహర మహదేవ్ అంటూ ఆధ్యాత్మిక సైట్లు ప్రత్యక్షమవుతాయి. ఆధ్యాత్మిక భజన్లు, కీర్తనలు, ప్రార్థనలు ముంచెత్తుతాయి. ఇవన్నీ పోర్న్ సైట్లు చూసి పిల్లలు పెడదోవ పట్టకుండా వుండేందుకేనని ఈ యాప్ రూపకర్త డాక్టర్ విజయ్‌నాథ్ మిశ్రా చెపుతున్నారు. పోర్న్ సైట్లు క్లిక్ చేస్తే హిందూ కీర్తనలే ఎందుకు వస్తాయి... ఇతర మతాలకు చెందినవి ఎందుకు రావనే వారికి ఆయన సమాధానమిచ్చారు. 
 
ప్రస్తుతానికి హిందూ కీర్తనలు పెట్టామనీ, త్వరలో ఇతర మతాలకు చెందిన భజన్స్, శ్లోకాలు జతచేస్తామని తెలిపారు. కాగా ఇప్పటికే కేంద్రం 850కి పైగా పోర్న్ సైట్లను నిషేధించింది. ఇంకా ఈ కొత్త యాప్ తో ఇంకెక్కడయినా మిగిలిన పోర్న్ సైట్లు కూడా పూర్తిగా కనుమరుగవుతాయని అంటున్నారు.