మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 16 జూన్ 2017 (12:26 IST)

నిద్రిస్తున్న వ్యక్తిపై నిప్పంటించిన యువకులు.. వీడియో చూడండి

సోషల్ మీడియా ప్రభావంతో యువత రెచ్చిపోతోంది. చిన్న చిన్న ఈవెంట్లు జరిగినా ఫోటోలు, వీడియోలు తీసి అందులో పోస్ట్ చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే చెన్నైలో యువకులు ఓవరాక్షన్ చేశారు. తాము చేసిన దుశ్చర్యన

సోషల్ మీడియా ప్రభావంతో యువత రెచ్చిపోతోంది. చిన్న చిన్న ఈవెంట్లు జరిగినా ఫోటోలు, వీడియోలు తీసి అందులో పోస్ట్ చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే చెన్నైలో యువకులు ఓవరాక్షన్ చేశారు. తాము చేసిన దుశ్చర్యను ఏదో ఘనకార్యం చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టు చేసి రాక్షసానందం పొందారు. అయితే ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో పోలీసులకు చిక్కారు. 
 
వివరాల్లోకి వెళితే.. చెన్నైలో రోడ్డు పక్కన నిద్రపోతోన్న ఓ వ్యక్తికి కొంత‌మంది పోకిరీలు నిప్పంటించి, సెల్‌ఫోన్‌లో వీడియో తీసి ఆనందప‌డ్డారు. అనంత‌రం ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేసి తామేదో ఘ‌న‌కార్యం చేశామన్నట్లు ప్ర‌చారం చేసుకున్నారు. ఓ పేద వ్యక్తి మద్యం సేవించి రోడ్డు మీద నిద్రిస్తుండగా.. అతని వద్దకు వెళ్లిన యువకులు నిప్పింటించారు. బాధితుడు నిప్పు నుంచి దూరం జరిగి ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 
 
కానీ ఆ యువకులంతా వచ్చి అతడిని కాళ్లతో తంతూ, చేతులతో కొడుతూ కనిపించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. పోలీసులు ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.