మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 17 జులై 2018 (10:11 IST)

నా భర్త నాకు తలాక్ చెప్పి ఆయన తండ్రికి పడక సుఖం ఇవ్వాలన్నాడు...

నిఖా హలాలా వ్యవహారంపై సుప్రీంకోర్టు వాదనలు వింటున్న ప్రస్తుత తరుణంలో ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న మహిళలు ముందుకు వస్తున్నారు. తాజాగా బైరెల్లీలో తన భర్త తనకు తలాక్ చెప్పిన గంటల్లోనే తన భర్త తండ్రిని కట్టుకోమన్నారనీ, పైగా అతడితో పడక సుఖం పంచుకోవాలని ఒ

నిఖా హలాలా వ్యవహారంపై సుప్రీంకోర్టు వాదనలు వింటున్న ప్రస్తుత తరుణంలో ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న మహిళలు ముందుకు వస్తున్నారు. తాజాగా బైరెల్లీలో తన భర్త తనకు తలాక్ చెప్పిన గంటల్లోనే తన భర్త తండ్రిని కట్టుకోమన్నారనీ, పైగా అతడితో పడక సుఖం పంచుకోవాలని ఒత్తిడి చేసినట్లు షబీనా అనే మహిళ ఆరోపించింది. తన భర్త తలాక్ చెప్పిన వెంటనే మామయ్యను పెళ్లాడాలంటూ ఒత్తిడి చేశారనీ, ఆయనతో పడక సుఖం పంచుకోవాలనీ, ఈ విషయాన్ని ఎక్కడైనా చెప్తే చంపేస్తామని బెదిరించారని కూడా ఆమె వెల్లడించింది. 
 
తన మామయ్యతో పడక సుఖం పంచుకున్నాక ఆయన కూడా తనకు తలాక్ చెప్తారనీ, ఆ తర్వాత తన బావను పెళ్లాడి ఆయనతో కూడా పడక సుఖాన్ని పంచుకోవాలని తన భర్త కుటుంబ సభ్యులు చెప్పినట్లు ఆమె వాపోయింది. తను ఎంత ప్రతిఘటించినా లాభం లేకపోయిందనీ, దానితో విధి లేని పరిస్థితుల్లో మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు చెప్తున్నట్లు ఆమె వెల్లడించింది. తనకు న్యాయం చేయాలంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.