మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 14 జులై 2018 (15:05 IST)

కోడిగుడ్డుకూర వండలేదని గన్‌తో భార్యను కాల్చేసిన భర్త

ఉత్తరప్రదేశ్ షాజహాన్‌పూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కోడిగుడ్డు కూర వండలేదని భార్యను ఓ భర్త తుపాకీతో కాల్చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. షాజహాన్ పూర్ జిల్లాలోని దే

ఉత్తరప్రదేశ్ షాజహాన్‌పూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కోడిగుడ్డు కూర వండలేదని భార్యను ఓ భర్త తుపాకీతో కాల్చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. షాజహాన్ పూర్ జిల్లాలోని దేవదాస్ గ్రామానికి చెందిన 33 ఏళ్ల నవనీత్-మంగేశ్ శుక్లాకు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. నవనీత్ వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 
 
అయితే నవనీత్ తాగుడుకు బానిస అయ్యాడు. గురువారం తప్పతాగి ఇంటికొచ్చాడు. కోడిగుడ్డు కూర వండాలని భార్యకు చెప్పాడు. కానీ కోడిగుడ్డుకూర వండేందుకు భార్య నిరాకరించడంతో నవనీత్‌ కోపంతో ఊగిపోయాడు. మద్యం మత్తులో ఉన్న నవనీత్ ఇంట్లోకి వెళ్లి తన తండ్రి లైసెన్స్‌డ్ గన్‌ను తీసుకువచ్చి భార్య శుక్లాపై కాల్పులు జరిపాడు. 
 
ఈ ఘటనలో గాయపడిన శుక్లాను స్థానికులు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలిస్తుండగానే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై శుక్లా సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడిని అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.