శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 30 ఏప్రియల్ 2017 (10:31 IST)

అమెరికాపై సునీల్ మిట్టల్ ఫైర్.. ఫేస్ బుక్, ట్విట్టర్‌ను భారత్‌లో నిషేధించాలి

హెచ్‌-1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆరు నెలల వరకు తాత్కాలిక రద్దు ఉండొచ్చని యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌

హెచ్‌-1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆరు నెలల వరకు తాత్కాలిక రద్దు ఉండొచ్చని యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) వెల్లడించింది. ఏప్రిల్‌ 3 నుంచి హెచ్‌1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌ రద్దు అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా హెచ్-1బీ వీసాలపై ఆంక్షలను విధించడంపై ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ఘాటుగా స్పందించారు. 
 
అమెరికా చర్యలకు ప్రతిగా భారత్ ఫేస్‌బుక్, గూగుల్, వాట్సప్‌లను నిషేధించాలని సునీల్ మిట్టల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. విదేశాలకు చెందిన సంస్థలు భారత్‌లో వ్యాపారం చేస్తూ భారీగా ఆర్జిస్తున్నాయని, ఈ విషయాన్ని ఆయా దేశాలు గుర్తించాలని తెలిపారు. భారత్‌లో ఇలాంటి సెర్చ్ ఇంజన్లు, యాప్‌లు చాలా ఉన్నాయని, అలాంటప్పుడు అమెరికాకు చెందిన వాటిని ఎందుకు ఉపయోగించాలని అడిగారు. భారతీయుల రాకపై అమెరికా ఆంక్షలు విధించడం సరికాదన్నారు.