గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By శ్రీ
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2020 (09:35 IST)

కరోనా పాజిటివ్ వస్తే ఉచితంగా ఆక్సీమీటర్ : కేజ్రివాల్

దేశ రాజధాని ఢిల్లీలో “కరోనా” కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నది. దీంతో “కరోనా” పరీక్షలను రెట్టింపు చేస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రస్తుతం రోజుకు 20,000 “కరోనా” పరీక్షలు నిర్వహిస్తుండగా ఇకపై రోజుకు 40,000 పరీక్షలు జరుపుతామన్నారు. “కరోనా” పరీక్షలు చేయించుకోవడానికి సంశయించకుండా, ముందుకు రావాలని ప్రజలకు మరోసారి పిలుపునిచ్చారు కేజ్రివాల్.
 
మనం, మున చుట్టుపక్కల వారు సురక్షితంగా ఉండేందుకు “కరోనా” లక్షణాలున్న వారు తప్పకుండా పరీక్ష చేయించుకోవాలని చెప్పారు.  “కరోనా” పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారికి పల్స్ ఆక్సీమీటర్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్‌ను ప్రభుత్వం అందజేస్తుందని ఆయన చెప్పారు. 
 
మంగళవారం ఢిల్లీలో 1,544 “కరోనా” కేసులు నమోదయ్యాయి.  గత 40 రోజుల్లో ఈ స్థాయిలో “కరోనా” కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.  ఢిల్లీలో మొత్తం “కరోనా” కేసుల సంఖ్య 1.64 లక్షలు దాటగా ఇప్పటి వరకు 4,330 మంది మరణించారు.