సోమవారం, 13 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 మార్చి 2017 (10:43 IST)

ప్రేమోన్మాది ఘాతుకం.. వేటకొడవలితో విద్యార్థిని గొంతుకోసేసిన దుర్మార్గుడు

తమిళనాడులోని రామనాథపురంలో ఓ ప్రేమోన్మాది విద్యార్థిని పొట్టనబెట్టుకున్నాడు. తనకు దక్కని మనిషి వేరొకరికి దక్కకూడదనే అక్కసుతో.. విద్యార్థినిని చంపేశాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని రామనాథపురం జిల్

తమిళనాడులోని రామనాథపురంలో ఓ ప్రేమోన్మాది విద్యార్థిని పొట్టనబెట్టుకున్నాడు. తనకు దక్కని మనిషి వేరొకరికి దక్కకూడదనే అక్కసుతో.. విద్యార్థినిని చంపేశాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని రామనాథపురం జిల్లా తిరువాడానై సమీపంలోని అడుత్హకుడ గ్రామానికి చెందిన పళనిస్వామి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు.

అతని భార్య మహేశ్వరి, కుమార్తె ధరణి గ్రామంలో ఉంటున్నారు. శివగంగై జిల్లా మహిళా కాలేజీలో ధరణి బీఎ ఫస్టియర్ చదువుతోంది. వీరి ఇంటి పక్కనే నివసించే బంధువు సేతురామన్ కుమారుడు కుమార్ చెన్నైలో లెదర్ సంచులు కుడుతూ జీనవం సాగించేవాడు.
 
కొంతకాలంగా ధరణిపై ప్రేమ పెంచుకొన్న కుమార్ తరచూ గ్రామానికి వచ్చి వెళ్ళేవాడు. ఆరు నెలల క్రితం తన బంధువులతో కలిసి ధరణి ఇంటికి వెళ్ళి పెళ్ళి చేయాలని కోరారు. దీనికి ధరణి తల్లిదండ్రులు నిరాకరించారు. ఆ తర్వాత ధరణి వెంట పడేవాడు. పెళ్ళి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో పాటు.. ఆమెను వేధింపులకు గురిచేశాడు. దీంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ తలెత్తింది.
 
ధరణి తల్లి అన్న కలిసి కుమార్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో  కాలేజీకి సెలవు కావడంతో పెరటి తలుపులు తెరి ఉంచి ధరణి ఇంట్లో ఒంటరిగా నిద్రించింది. ఈ విషయాన్ని తెలుసుకొన్న కుమార్ ఇంట్లోకి చొరబడి తలుపులకు లోపలి నుండి తాళం వేశాడు. ఆమెను వేట కొడవలితో గొంతుకోశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలకు గురైన బాధితురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.