ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 6 జులై 2021 (09:38 IST)

ఉచితంగా స్పుత్నిక్ వ్యాక్సిన్

ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రులలో లభ్యమవుతున్న రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ అతి త్వరలోనే ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా లభ్యం కానుంది. ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఒక అధికారి వెల్లడించారు.

ప్రభుత్వం ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించనున్నదని తెలిపారు. కాగా దేశంలో సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కోవాగ్జిన్ టీకాలను ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా అందిస్తున్నారు.
 
కోవిడ్-19 వర్కింగ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఎన్‌కే అరోరా మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ప్రభుత్వం స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించనున్నదని తెలిపారు.

ఈ వ్యాక్సిన్ మరిన్ని డోసులు అందితే దేశంలో వ్యాక్సినేషన్ మరింత ముమ్మరంగా జరుగుతుందన్నారు. కాగా దేశంలో ఇప్పటివరకూ 35 కోట్ల 26 లక్షల 92 వేల, 46 మందికి వ్యాక్సిన్ వేశారు.