ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 10 సెప్టెంబరు 2017 (17:37 IST)

ఇడియట్ కమల్ హాసన్ సీపీఎంలో చేరుతున్నట్లు విన్నాను: స్వామి

సినీ లెజెండ్ కమల్ హాసన్ రాజకీయ ప్రవేశం త్వరలో ప్రకటన వుంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి కమల్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కమల్ బీజేపీలో మాత్రం చేరనని క్లారిట

సినీ లెజెండ్ కమల్ హాసన్ రాజకీయ ప్రవేశం త్వరలో ప్రకటన వుంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి కమల్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కమల్ బీజేపీలో మాత్రం చేరనని క్లారిటీ ఇచ్చేసిన తరుణంలో ఇడియట్ కమల్ హాసన్ సీపీఎంలో చేరుతున్నట్లు విన్నానంటూ సుబ్రమ్మణ్యస్వామి చేసిన ట్వీట్ పెను దుమారం రేపింది. 
 
ఐపీఎల్‌లో వచ్చే ఐదేళ్ల కాలానికి టెలివిజన్, డిజిటల్‌ రైట్స్‌ను భారీ మోత్తానికి స్టార్ ఇండియా సంస్థ కైవసం చేసుకోవడంలో లాబీయింగ్ జరిగిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్వామి.. తాజాగా కమల్ హాసన్‌ను ఇడియట్ అంటూ సంబోధించారు. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్వామికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. కాగా కమల్ హాసన్ సీపీఎంలో చేరనున్నట్లు తమిళనాట విస్తృత ప్రచారం జరుగుతోంది.