శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 26 అక్టోబరు 2017 (16:06 IST)

సునంద హత్య కేసులో సమాచారం దాచిపెట్టిన స్వామి : కోర్టు

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ హత్య కేసులో బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామికి కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో మళ్లీ విచారణ జరపాలని కోరుతూ దాఖలైన

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ హత్య కేసులో బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామికి కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో మళ్లీ విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పిటీషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. 
 
స్వామి దాఖలు చేసిన పిటీషన్‌లో సునందా మృతి కేసులో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేత వేసిన అభ్యర్థన పిటిషన్.. ఓ రాజకీయ ప్రయోజన వాజ్యంలా ఉందని కోర్టు అభిప్రాయపడింది. 
 
సునంద హత్య కేసులో బీజేపీ ఎంపీ తన దగ్గర ఉన్న సమాచారాన్ని దాచి పెట్టారని కోర్టు పేర్కొంది. మిస్టరీగా మారిన సునందా మృతి కేసులో ముందుగా సమర్పించాల్సిన అంశాలను సుబ్రమణ్యస్వామి రహస్యంగా ఉంచారని కోర్టు వెల్లడించింది.