ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 18 నవంబరు 2016 (14:25 IST)

పెద్ద నోట్ల రద్దుపై ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.. మీ వైఖరేంటి: కేంద్రానికి సుప్రీం ప్రశ్న

దేశంలో పెద్ద నోట్ల రద్దుపై కేంద్రానికి సుప్రీంకోర్టు కొన్ని ప్రశ్నలు సంధించింది. కరెన్సీ నోట్ల రద్దుపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనీ, దీనిపై మీ వైఖరేంటని ప్రశ్నించింది. పెద్ద నోట్ల రద్దుపై ప్రజలు

కింది కోర్టులో కేసుదేశంలో పెద్ద నోట్ల రద్దుపై కేంద్రానికి సుప్రీంకోర్టు కొన్ని ప్రశ్నలు సంధించింది. కరెన్సీ నోట్ల రద్దుపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనీ, దీనిపై మీ వైఖరేంటని ప్రశ్నించింది. పెద్ద నోట్ల రద్దుపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.లు వేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఇది చాలా పెద్ద నిర్ణయమని, ప్రజలను ఒప్పించలేకపోతున్నారని పేర్కొంది.
 
పాత నోట్ల రద్దు నిర్ణయం ఉపసంహరించుకునేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలంటూ కోల్‌కతా, ఏపీ హైకోర్టులతోపాటు అన్నీ న్యాయస్థానాల్లోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని శుక్రవారం సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టులు డి-మోనటైజేషన్ పాలసీపై విచారణ చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును అటార్నీ జనరల్ ముఖుల్ రోహత్గీ కోరారు.
 
ఆయన వినతిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అలాంటి ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది. పెద్ద నోట్ల రద్దుతో రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారస్తులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. సామాన్య ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.