శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 21 డిశెంబరు 2017 (12:16 IST)

అయోధ్యలో రామాలయం ఏర్పాటు ఆ ఇద్దరి వల్లే సాధ్యం: స్వరూపానంద

అయోధ్యలో రామాలయ వివాదంపై ద్వారక శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి బృందావనంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము లౌకిక వాదులమని చెప్పుకునే రాజకీయ పార్టీలు అయోధ్యలో రామాలయాన్ని నిర్మించలేవని స్వామి స్

అయోధ్యలో రామాలయ వివాదంపై ద్వారక శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి బృందావనంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము లౌకిక వాదులమని చెప్పుకునే రాజకీయ పార్టీలు అయోధ్యలో రామాలయాన్ని నిర్మించలేవని స్వామి స్పష్టం చేశారు. 
 
శంకరాచార్యులు, ధర్మాచార్యులకు మాత్రమే అయోధ్యలో రామాలయాన్ని నిర్మించే హక్కు ఉందని చెప్పుకొచ్చారు. గంగా, యమున నదుల్లో కాలుష్యం పెరిగిందని స్వరూపానంద సరస్వతి వ్యాఖ్యానించారు. అంతేగాకుండా.. భారతదేశంలో జన్మించిన ముస్లిములందరూ హిందువులేనని ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను స్వామి స్వరూపానంద వ్యతిరేకించారు. 
 
నిజమైన హిందువులు వేదాలు, శాస్త్రాలను నమ్ముతారని, మహమ్మదీయులు ఖురాన్, హదీస్‌లు చదువుతారని, క్రైస్త్రవులు వారి మత గ్రంథమైన బైబిల్‌పై విశ్వాసం చూపిస్తారని స్వామి చెప్పుకొచ్చారు.