శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 మార్చి 2024 (20:05 IST)

శివయ్య నిమ్మకాయ.. వేలంలో రూ.35వేలు పలికింది..

lemon
మహాశివరాత్రి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాల సందర్భంగా స్వామికి అభిషేక ఆరాధనల కోసం భక్తులు వారి వారి శక్తికి మేర వస్తువులను సమర్పించుకున్నారు. ఆపై స్వామికి సమర్ఫించిన వాటిని ప్రసాదంగా స్వీకరించారు. 
 
అలా తమిళనాడులోని ఓ గ్రామంలో శివరాత్రికి తర్వాత ఓ శివాలయంలో నిర్వహించిన వేలంలో ఒక్క నిమ్మకాయ రూ.35,000 పలికిందని ఆలయ అధికారులు తెలిపారు. 
 
శివగిరి గ్రామ సమీపంలోని పూసయ్య ఆలయంలో శుక్రవారం రాత్రి మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా శివుడికి సమర్పించిన నిమ్మకాయ, పండ్లతోపాటు ఇతర వస్తువులను ఆచారం ప్రకారం వేలం వేశారు. 
 
వేలం వేసిన నిమ్మకాయను ఆలయ పూజారి పీఠాధిపతి ముందు ఉంచి చిన్న పూజ నిర్వహించి వందలాది మంది భక్తుల సమక్షంలో వేలంలో అత్యధిక ధర పలికిన వ్యక్తికి తిరిగి అందజేశారు.
 
 
 
ఈ వేలంలో ఆ నిమ్మకాయ 35వేల రూపాయలు పలికింది. ఈ నిమ్మకాయను పొందిన వ్యక్తి సిరిసంపదలతో తులతూగుతాడని.. అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో జీవిస్తాడని విశ్వాసం.