బరువు తగ్గాలా.. అల్లం, నిమ్మరసం చాలు..
శరీర బరువు అనేది ప్రస్తుతం సాధారణ సమస్యగా మారింది. శరీర బరువును తగ్గించాలని మహిళలు ఏవేవో కసరత్తులు చేస్తుంటారు. అలాంటి వారికి ఈ రెమెడీ అద్భుతంగా పనిచేస్తుంది. రోజూవారీ ప్లాన్‌లో ఆచరించే పద్ధతుల్లో ముందుగా మార్చాల్సింది.. ఉదయం పూట డైట్‌నే. బరువు తగ్గాలనుకునే వారు ఉదయం పూట అల్లం, నిమ్మరసంతో కూడిన వాటర్‌ను తీసుకోవడం మంచిది. ఇది శరీర బరువును సులభంగా తగ్గిస్తుంది.
దీనిని పరగడుపున తీసుకోవడం ద్వారా కొవ్వు కరుగుతుంది. అల్లం, నిమ్మరసంతో కూడిన నీటిని సేవించడం ద్వారా కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్తికి చెక్ పెడుతుంది. అల్లం, లెమన్ వాటర్ తీసుకోవడం ద్వారా శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి.
ఇంకా రక్తం శుద్ధి అవుతుంది. కాలేయ పనితీరును ఈ రెండు మెరుగుపరుస్తాయి. నిమ్మరసం, అల్లం వాటర్‌లోని పోషకాలు శరీరానికి శక్తినిస్తాయి. తద్వారా అలసట దూరం అవుతుంది. కాబట్టి, అల్లం, నిమ్మరసం కలయికతో కూడిన నీటిని రోజువారీ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు శరీర బరువును సులభంగా తగ్గించవచ్చు.