గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 జనవరి 2024 (17:51 IST)

డ్రాగన్ ఫ్రూట్‌తో గుండెకు మేలు.. బరువు కూడా పెరగరు...

పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి అనేక పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. 
 
డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువగా అమెరికా, ఆస్ట్రేలియాలో పండిస్తారు. ప్రస్తుతం ఈ పండు మన దేశంలో కూడా పెరుగుతోంది. ఇది చూడటానికి పింక్ కలర్, డ్రాగన్ ఆకారంలో ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల కలిగే మరికొన్ని ప్రయోజనాలను తెలుసుకుందాం.
 
మన రోజువారీ ఆహారంలో భాగంగా డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా డ్రాగన్ ఫ్రూట్ నివారిస్తుంది. వీటిలో ఉండే 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. ఎసిడిటీ, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారు ఈ పండుతో త్వరగా ఉపశమనం పొందుతారు. ఇంకా, డ్రాగన్ ఫ్రూట్ వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ దంతాలు, చిగుళ్ల సమస్యలను నివారిస్తుంది.