సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (20:52 IST)

కూనూర్‌లో నల్లపులి.. రాత్రిపూట నివాసం బయట సైలైంట్‌గా ఏం చేసింది?

Black Panther
Black Panther
తమిళనాడులోని నీలగిరిలోని కూనూర్‌లో నల్లపులి రాత్రిపూట నివాసం వెలుపల సంచరిస్తూ ఉండడం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఆ ప్రాంతం వాసులు షాక్‌కు గురయ్యారు. ఇది స్థానిక నివాసితులలో భయాందోళనలు, భయాన్ని రేకెత్తించింది.
 
ఇంటి ప్రవేశ ద్వారం వెలుపల అమర్చబడిన సీసీటీవీ కెమెరా ఫుటేజీలో నల్లపులి నిశ్శబ్దంగా ప్రవేశించి ప్రధాన ద్వారం గుండా వెళుతున్నట్లు కనిపిస్తుంది. నల్లపులి శబ్ధం లేకుండా ఆహారం కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. కూనూర్‌లో బ్లాక్ పాంథర్ కనిపించిన వీడియోకు భారీ స్థాయిలో వ్యూస్, లైక్స్ వస్తున్నాయి.