మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (14:42 IST)

పడకసుఖం ఇవ్వమన్న భర్త... చంపసిన భార్య.. ఎక్కడ?

గర్భవతి అని కూడా చూడకుండా భర్త తన కోరిక తీర్చాలంటూ ఇబ్బందిపెట్టడాన్ని తట్టుకోలేని భార్య.. అతడిని చంపి పోలీసులకు లొంగిపోయింది. ఈ ఘటన తమిళనాడులోని  అందియార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. 
 
నిండు గర్భంతో ఉందన్న కనీస జ్ఞానం కూడా లేకుండా కట్టుకున్న భర్త కట్టుకున్న భార్యను పడక సుఖం ఇవ్వమని ఒత్తిడి చేశాడు. ఇలాంటి సమయంలో తాను కోరిక తీర్చలేనని ఆమె ప్రాధేయపడింది. అయినప్పటికీ.. అతను వినపించుకోలేదు. దీంతో శివంగిలా మారిన భార్య ... భర్తను చంపేసి నేరుగు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. 
 
ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని అందియూరు సమీపంలోని కాలియన్నన్‌ తోట్టంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ ప్రాంతానికి చెందిన నందకుమార్‌ అనే వ్యక్తికి పెరియమోలపాయలెంకు చెందిన మైథిలి అనే మహిళతో ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగింది. ఇంతలో ఆమె గర్భందాల్చింది. ప్రస్తుతం ఆమెకు ఐదు నెలలు. 
 
అయితే, పొలం పనులు చేసే కుమార్‌.. కోరిక తీర్చాలంటూ నిత్యం వేధిస్తుండటంతో గర్భిణి అయిన మైథిలి చాలా ఇబ్బందిపడిపోయింది. భర్త అగచాట్లు రోజురోజుకు శ్రుతిమించిపోతుండటంతో భరించలేని మైథిలి.. భర్తను కడతేర్చాలన్న నిర్ణయానికి వచ్చింది. దాంతో గత నెల 28 న పురుగుల మందు కలిపిన ఆహారాన్ని ఆయనకు రాత్రి భోజనంలో అందించింది.
 
దాంతో కుమార్‌ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొని రెండు రోజుల తర్వాత అందియూర్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స నిమిత్తం చేరాడు. అక్కడ 15 రోజులపాటు అత్యవసర విభాగంలో చికిత్స పొందిన నందకుమార్‌ తుదకు కన్నుమూశాడు. దవాఖాన యాజమాన్యం కుమార్‌ చనిపోయిన విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
దాంతో కోరిక తీర్చాలంటూ తనను ఇబ్బందిపెడుతుండటంతో తట్టుకోలేక తానే పురుగులమందు భోజనంలో కలిపి తినిపించి చనిపోయేలా చేశానని పోలీసులకు చెప్పి లొంగిపోయింది. కేసు నమోదు చేసుకుని అందియూర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌ రవి దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలు మైథిలిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు 15 జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.