ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 జూన్ 2020 (12:32 IST)

టిక్ టాక్‌ వీడియో.. బతికి వున్న చేపను మింగుతూ ప్రాణాలు..?

టిక్‌టాక్ వీడియో ఓ డిగ్రీ విద్యార్థి ప్రాణాలను బలి తీసుకుంది. బతికి వున్న చేపను మింగుతూ వీడియో తీశాడు. అయితే చేప కాస్త గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు.

హోసూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానిక కేలైకుంట పార్వతీనగర్‌కు చెందిన వెట్రివేల్ (22) డిగ్రీ చదువుతున్నాడు. ఇటీవలి కాలంలో టిక్‌టాక్‌పై మోజు పెంచుకున్న ఈ యువకుడు.. ఆసక్తిగొలిపేలా ఓ వీడియో చేయాలని నిర్ణయించుకున్నాడు. 
 
ఇందులో భాగంగా బతికున్న చేపను మింగుతూ వీడియో చేశాడు. అయితే, చేప కాస్తా గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరి ఆడక గిలగిల్లాడిపోయాడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని హోసూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.