సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 22 అక్టోబరు 2020 (06:25 IST)

ఘాటెక్కిన ఉల్లి ధర

దేశవ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కిలో ఉల్లి ధర రూ.100కు చేరింది. రైతుబజార్లలో కిలో రూ.75కు విక్రయిస్తుండగా, బయటి మార్కెట్లో మాత్రం వంద రూపాయలు పలుకుతోంది.

సెప్టెంబరు నుంచి జనవరి వరకు కర్నూలు జిల్లాతోపాటు, కర్ణాటక నుంచి ఉల్లి వస్తుంది. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు మహారాష్ట్ర, కర్ణాటకలతోపాటు కర్నూలులోని పంట మొత్తం నాశనమైపోయింది.
 
దిగుమతులపై నిబంధనల సడలింపు
ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఉల్లి దిగుమతులపై నిబంధనలను సడలించింది. దేశీయంగా సరఫరాను పెంచి పెరుగుతున్న రిటైల్‌ ధరలను అదుపు చేయడానికి ఉల్లిపాయలను ముందుగా రవాణా చేయడానికి వీలుగా ప్రభుత్వం డిసెంబర్‌ 15 వరకు దిగుమతి నిబంధనలను సడలించింది.

ఈ మేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. దేశానికి భారీగా ఉల్లి దిగుమతి అయ్యేలా వ్యాపారులతో సంప్రదింపులు జరపాలని సంబంధిత దేశాల్లోని భారత హై కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలు నేరుగా భారతీయ ఓడరేవులకు చేరతాయని మంత్రిత్వశాఖ తెలిపింది.