గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 7 జూన్ 2020 (17:38 IST)

ముంబయిలో దుర్వాసన... బెంబేలెత్తుతున్న జనం

కరోనాతో హడలెత్తిపోతున్న ముంబై వాసులకు కొత్త చిక్కొచ్చిపడింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

శనివారం రాత్రి నుండి వెల్లువెత్తిన ఫిర్యాదులతో పరిపాలనా అధికారులు, బృహన్‌ ముంబయి మునిసిపల్‌ కార్పోరేషన్‌ (బిఎంసి), అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు.

చెంబూర్‌, ఘట్కోపర్‌, కంజుర్‌మార్గ్‌, విఖ్రోలి, పొవాయి, అంథేరి, మంఖుర్డ్‌ తదితర ప్రాంతాల నుండి ఫిర్యాదులు అందాయని అధికారులు తెలిపారు.

గ్యాస్‌ లీకేజీ ఏమైనా జరిగిందా అన్న కోణంలో విచారిస్తున్నామని, అయితే ఎక్కడా లీకేజీ జరిగిన దాఖలాలు లేవని ముంబయి అగ్నిమాపక దళానికి చెందిన సీనియర్‌ అధికారి వెల్లడించారు.