బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 3 అక్టోబరు 2019 (08:40 IST)

ముంబైలో తెలుగు పోస్టర్లు

ముంబై నగరంలో నమస్తే వర్లీ అనే తెలుగు పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. త్వరలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే ఫోటోలతో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. ప్రతి పోస్టర్ పైనా ‘హౌ ఆర్ యూ వర్లీ’ అని ఆదిత్య థాకరే పలకరిస్తున్నట్టు చూపించారు.

మరాఠీ, గుజరాతీ, ఉర్దూలో ఫ్లెక్షీలు ఏర్పాటు చేయగా ఓ పోస్టర్లో ‘కెంచో వర్లీ’ అని గుజరాతీలో ‘నమస్తే వర్లీ’ అని తెలుగు, మరాఠీ భాషల్లో ఈ పోస్టర్లున్నాయి.