శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 21 సెప్టెంబరు 2019 (09:55 IST)

శాంతించిన వరుణుడు.. కుదుడపడుతున్న ముంబై

ఉరుములతో కూడిన వర్షాలు వస్తాయి తస్మాత్ జాగ్రత్త అన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ముంబై వణికిపోయింది. ఇప్పటికే భారీ వర్షాల ధాటికి నీటిలో నానిపోతున్న జనం.. మరో కుండపోత వాన పొంచి ఉందన్న హెచ్చరికలతో అందోళన చెందారు. కానీ, వరణుడు కరుణించి చిరు జల్లులతోనే సరిపెట్టడంతో ముంబై ఊపిరిపీల్చుకుంది.

వాన భయం తొలిగిపోవటంతో రెడ్ అలర్ట్ ను అరేంజ్ అలర్ట్ గా మార్చింది ఐఎండీ. అయితే..ఇప్పటికే కురిసిన వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

ఉత్తరాదిన కురుస్తోన్న వర్షాలకు గంగా, యమునా నదుల్లో నీటిమట్టం అంతకంతకూ పెరిగిపోతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో భారీగా వరద నీరు చేరడంతో.. తీరప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. ప్రయాగ్‌రాజ్‌లోని లోతట్టు ప్రాంతాల్లో భవనాలు సగం వరకు నీటమునిగాయి.

వారణాసిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పర్యటించారు. నదిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి పడవలో ప్రయాణించి వరద పరిస్థితులను తెలుసుకున్నారు. నదుల్లోకి వరదనీరు పోటెత్తడంతో పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు.