సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 అక్టోబరు 2019 (17:24 IST)

నాపై నా భర్త మూత్రం పోస్తున్నాడు.. బీజేపీ మంత్రి భార్య

బీజేపీ నేతలకు ఇప్పటికే నోటిదురుసు ఎక్కువనేందుకు కొన్ని ఘటనలు జరిగివున్నాయి. మహిళలపై నోటికి వచ్చినట్లు మాట్లాడటం వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, అకృత్యాలకు పాల్పడటంలో బీజేపీ నేతలు ముందుంటారు. తాజాగా యూపీ మంత్రి బాబూరామ్ నిషాద్‌పై ఆయన భార్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అంతేగాకుండా తన భర్త వ్యవహారంపై ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యానాత్‌లకు కూడా ఫిర్యాదు చేసింది. 
 
ఈ ఫిర్యాదులో భాగంగా... ఫేస్‌బుక్‌లో  14 ఏళ్ల క్రితం బాబూరామ్‌తో తనకు వివాహం జరిగినట్లు పేర్కొంది. ప్రతిరోజూ తన భర్త తనను చిత్ర హింసలకు గురిచేస్తున్నారని నీతు ఆరోపణలు చేశారు. అంతేకాకుండా.. గన్‌తో కాల్చేస్తానని బెదిరిస్తున్నాడని.. పోలీసులకు  ఫిర్యాదు చేసినా ప్రయోజనం మాత్రం శూన్యమని చెప్పారు.  
 
తనపై తన భర్త మూత్రం పోస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలపై  నీతు భర్త బాబూరామ్ స్పందించారు. ఆమె చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, ప్రతి రోజూ తన నుంచి ఆమె డబ్బు డిమాండ్ చేస్తోందని ఆరోపించారు. అధిక మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్న కారణంగా ఆమె నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించానని వెల్లడించారు.