శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 2 మే 2018 (17:01 IST)

ప్రపంచంలో అత్యంత కలుషిత నగరంగా ఢిల్లీ

దేశరాజధాని ఢిల్లీ మహానగరం అత్యంత చెత్తరికార్డును మూటగట్టుకుంది. ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరంగా ఢిల్లీ పేరుగడించింది. ప్రపంచంలో 20 అత్యంత పొల్యుషన్ సిటీస్ లిస్టులో భారత్‌‌లోనే 14 నగరాలు ఉండటం గమనార్హ

దేశరాజధాని ఢిల్లీ మహానగరం అత్యంత చెత్తరికార్డును మూటగట్టుకుంది. ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరంగా ఢిల్లీ పేరుగడించింది. ప్రపంచంలో 20 అత్యంత పొల్యుషన్ సిటీస్ లిస్టులో భారత్‌‌లోనే 14 నగరాలు ఉండటం గమనార్హం. ఇందులో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది.
 
ఆ తర్వాత స్థానంలో కైరో, మూడో స్థానంలో ఢాకా ఉన్నాయి. అయితే, భారత్‌లో మాత్రం కాలుష్యపూరిత నగరాల్లో వారణాసి, కాన్పూర్‌, ఫరీదాబాద్‌, గయా, పాట్నా, ఆగ్రా, ముజఫరాపూర్‌, శ్రీనగర్‌, గురుగ్రామ్‌, జైపూర్‌, పటియాలా, జోథ్‌పూర్‌లు ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 2016లో నమోదైన కాలుష్య గణాంకాల ఆధారంగా వీటిని ప్రకటించినట్లు తెలిపింది. 
 
భారత్‌‌లోని నగరాలతో పాటు కువైట్‌‌లోని అలీ సుబాహ్‌ అల్‌ సలేం, మంగోలియా, చైనాలోని కొన్ని నగరాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ టాప్‌ 20 లిస్టులో ఉన్నాయి. ప్రపంచంలోని ప్రతి 10 మందిలో 9 మంది కాలుష్యపూరిత గాలిని శ్వాసిస్తున్నట్లు వివరించింది. గాలిలో సల్ఫేట్‌, నైట్రేట్‌, బ్లాక్‌ కార్బన్‌ కారకాలు ఉండటం మనిషి ఆరోగ్యానికి ప్రమాదకరమని తెలిపింది. 
 
70 లక్షల మరణాలు యేటా గాలి కాలుష్యం వల్ల సంభవిస్తున్నాయని వెల్లడించింది. వీటిలో 24 శాతం మంది గుండె జబ్బులతో, 25 శాతం గుండెపోటుతో, 43 శాతం మంది ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో, 29 శాతం మంది ఊపరితిత్తుల క్యాన్సర్‌‌తో మరణించారని వివరించింది.