శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (11:38 IST)

భాజపా, కాంగ్రెస్‌.. దేశాన్ని నడిపించడంలో అట్టర్‌ ఫ్లాప్‌ .. కేసీఆర్

కేంద్రంలోని భాజపా ప్రభుత్వ విభజన రాజకీయాలపై దేశ ప్రజలు, ముఖ్యంగా యువత మేల్కోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం పిలుపునిచ్చారు. 
 
"దేశానికి కొత్త రాజ్యాంగం అవసరం. అమెరికా కంటే పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి పుష్కలమైన వనరులున్న భారతదేశం యొక్క నిజమైన సామర్థ్యాన్ని వెలికితీసే విప్లవాత్మక మరియు గుణాత్మక మార్పు దేశానికి అవసరం.. "అని కేసీఆర్ అన్నారు. 
 
ఇంకా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన కేంద్ర బడ్జెట్‌‌తో ఒరిగేదేమీ లేదని తెలిపారు. జాతీయ పార్టీలుగా చెప్పుకునే భాజపా, కాంగ్రెస్‌లు రెండూ దేశాన్ని నడిపించడంలో అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయి.
 
ముసుగులో రాష్ట్ర అధికారాలను చేజిక్కించుకోవడమే పనిగా పెట్టుకున్నాయని చంద్రశేఖర్‌రావు ప్రగతి భవన్‌లో మీడియాతో అన్నారు. 
 
దేశంలో అవసరాలకు మించి విద్యుత్తు, నీటి వనరులు ఉన్నాయని, బిజెపి ప్రభుత్వ దుష్ప్రవర్తన వల్ల దేశంలో 70 శాతం అంధకారంలో ఉందని, ఇళ్లు, రైతులు తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని చంద్రశేఖర్‌రావు అన్నారు.