శనివారం, 23 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (08:35 IST)

కామన్వెల్త్‌లో క్రికెట్‌కు చోటు - ఒకే గ్రూపులో భారత్ - పాకిస్థాన్

కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్‌కు చోటు కల్పించారు. దాదాపు 24 యేళ్ల తర్వాత ఈ అవకాశం లభించింది. గత 1998లో సింగపూర్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్‌ కూడా క్రీడాంశంగా ఉండేది. ఆ తర్వాత ఇపుడు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరుగనున్న కామన్వెల్త్ క్రీడల్లో ఈ క్రికెట్‌కు చోటు కల్పించారు.
 
ఈ కామన్వెల్త్ క్రీడలు జూలై 28 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు జరుగనున్నాయి. అయితే, ఈ దఫాకు మాత్రం మహిళల క్రికెట్ టోర్నీని మాత్రమే నిర్వహిస్తారు. టీ20 ఫార్మెట్‌లో క్రికెట్ పోటీలను నిర్వహిస్తారు. ఈ టోర్నీలో తొలిసారి క్రికెట్ ఆడనున్న మహిళా క్రికెట్ల వివరాలను పరిశీలిస్తే,
 
భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక, బార్బడోస్ జట్లు ఈ టోర్నీకి అర్హత సాధించాయి. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూపులో ఉండటం విశేషం. 
 
గ్రూపు-ఏలో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, బార్బడోస్ జట్టలకు చోటు కల్పించారు. 
గ్రూపు-బిలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు తలపడతాయి.