ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 జులై 2022 (11:51 IST)

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేది లేదు.. టీఎంసీ ఎంపీ క్లారిటీ

TMC
TMC
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తాము భాగస్వాములం కావట్లేదని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ, ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ తేల్చి చెప్పేశారు. ఎన్డీయే(ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధంఖర్)కు మద్దతిచ్చే ప్రశ్నే లేదని ఖరాఖండిగా వెల్లడించారు. ఆగస్టు 6న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాలుపంచుకునేదే లేదని అభిషేక్ బెనర్జీ స్పష్టం చేశారు. 
 
"ఎన్‌డిఎ (విపి) అభ్యర్థికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు. ఉభయ సభలలో 35 మంది ఎంపీలు ఉన్న పార్టీతో సరైన సంప్రదింపులు, చర్చలు లేకుండా ప్రతిపక్ష అభ్యర్థిని నిర్ణయించిన విధానంతో ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉండాలని మేము ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాము. మా ఎంపీలలో 85% తాము ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు' అని బెనర్జీ పేర్కొన్నారు.