గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 ఫిబ్రవరి 2024 (16:42 IST)

బైకర్‌పై దాడి చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. వీడియో వైరల్

Biker
Biker
మహారాష్ట్రలో ట్రాఫిక్ పోలీస్ ఓవరాక్షన్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని శంభాజీ నగర్‌లో ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ యువ బైకర్‌పై దాడి చేశాడు. ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ పట్టపగలు యువకులను తన్నడం, చెంపదెబ్బ కొట్టడం కెమెరాలో రికార్డ్ అయ్యింది. వైరల్‌లో తనపై జరుగుతున్న హింసను ఆపాలని యువకుడు చేతులు ముడుచుకుని వేడుకోవడం వీడియోలో కనిపించింది. 
 
మార్గమధ్యంలో ఒక యువకుడిని ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ క్రూరంగా కొట్టడం చూసిన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలే కానీ ఇలా దాడి చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు ముంబై ట్రాఫిక్ పోలీసు వివరణ ఇచ్చింది. డిపార్ట్‌మెంట్ ఒక ప్రతిస్పందనను పోస్ట్ చేసింది.
 
"ప్రియమైన ముంబైవాసులారా, ఇది వేరే నగరానికి చెందిన పాత వీడియో అని దయచేసి గమనించండి. సంబంధిత పోలీసు విభాగం ఇప్పటికే అవసరమైన చర్యలు తీసుకుంది. పట్టపగలు ఓ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ యువకులను తన్నడం, చెంపదెబ్బ కొట్టడం వీడియోలో కనిపించింది. ఈ వీడియోకు భారీ స్థాయిలో వీక్షణలు వస్తున్నాయి.