ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 3 ఫిబ్రవరి 2024 (23:12 IST)

GFSI 2024: రాధికా నాయుడు మిసెస్ గోల్డెన్ ఫేస్ ఆఫ్ హైదరాబాద్ కిరీటాన్ని గెలుచుకున్నారు

Radhika Naidu
గోల్డెన్ ఫేస్ అఫ్ సౌత్ ఇండియా 2024 గ్రాండ్ ఫినాలే విజయవంతంగా జరిగింది. విండో ఎంటర్‌టైన్‌మెంట్స్ వ్యవస్థాపకులు, గోపీనాథ్ రవి- శరవణన్‌తో పాటు ACTC స్టూడియో వ్యవస్థాపకుడు, సీఈఓ హేమంత్ ఈ అందాల పోటీ ద్వారా యాసిడ్ దాడి బాధితులకు చర్మ దానం గురించి అవగాహన కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
 
ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిధులు, మోడల్, నటి అమీ జాక్సన్, నటి శ్రేయ సరన్, ఇతర ప్రముఖులు విచ్చేశారు. ప్రముఖ దర్శకుడు & విండో ఎంటర్‌టైన్‌మెంట్స్ గౌరవ ఛైర్మన్, ఎఎల్ విజయ్, బ్రాండ్ అంబాసిడర్ పార్వతి నాయర్ ముఖ్య అతిథులతో వేదికను పంచుకున్నారు.
 
అటు కార్పొరేట్ ప్రపంచంలో క్యాప్‌జెమినీ టెక్నాలజీ సర్వీసెస్‌లో అంకితభావంతో కూడిన టీమ్ లీడర్ ఇటు బ్యూటీ ప్రపంచంలోనూ తన ప్రతిభను కనపరిచిన రాధికా GFSI 2024లో మిసెస్ గోల్డెన్ ఫేస్ ఆఫ్ హైదరాబాద్ అనే ప్రతిష్టాత్మక బిరుదును సాధించింది. అందం, ప్రతిభ, హుందాతనం, వ్యక్తిత్వంతో న్యాయనిర్ణేతలను మరియు ప్రేక్షకులను ఆకర్షించింది. ఈ పోటీల ద్వారా ఆమె ప్రయాణం ఆమె అంతర్గత ప్రకాశాన్ని మాత్రమే కాకుండా ఆమె నిబద్ధతను కూడా ప్రదర్శించింది.
 
ఖమ్మం నగరానికి చెందిన రాధికా హైదరాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించి మనందరినీ గర్వపడేలా చేసింది. కిరీటం కోసం ఆమె ప్రయాణం ఆమె అచంచలమైన సంకల్పం మరియు శ్రేష్ఠతకు నిబద్ధతకు నిదర్శనం.