మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 సెప్టెంబరు 2023 (12:33 IST)

Mr and Mrs: అట్టహాసంగా పరిణీతి చోప్రా- రాఘవ్ చద్దా వివాహం (Photos)

Parineeti Chopra, Raghav Chadha
Parineeti Chopra, Raghav Chadha
పరిణీతి చోప్రా- రాఘవ్ చద్దా భార్యాభర్తలు అయ్యారు. ఈ జంట ఉదయపూర్‌లో గ్రాండ్‌గా సన్నిహితులు, కుటుంబీకు సమక్షంలో వివాహబంధంతో ఒక్కటయ్యారు.  
 
నూతన వధూవరులు తమ వివాహానికి సంబంధించిన అధికారిక ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఉదయపూర్‌లో డ్రీమ్ డెస్టినేషన్ వెడ్డింగ్‌లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పరిణీతి- రాఘవ్ వివాహ ఫోటోలలో చూడముచ్చటగా కనిపించారు. 
Parineeti Chopra, Raghav Chadha
Parineeti Chopra, Raghav Chadha
 
ఇకపోతే.. గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా కజిన్‌ పరిణీతి చోప్రా.. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణిస్తుంది. సెలక్టీవ్‌గా సినిమా చేస్తూ ఆకట్టుకుంటుంది. ఆమె కొంత కాలంలో ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దాతో ప్రేమలో ఉంది. ఆ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లారు. 
 
ఇక పరిణీతి చోప్రా, రాఘవ్‌ చద్దాల వివాహానికి ఇద్దరు సీఎంలు, సినీ రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరు కావడం విశేషం. ఢిల్లీ సీఎం కేజ్రీవార్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మన్‌ హాజరయ్యారు. 
Parineeti Chopra, Raghav Chadha
Parineeti Chopra, Raghav Chadha
 
వీరితోపాటు ఉద్దవ్‌ ఠాక్రే కుమారుడు, సానియా మీర్జా, బాలీవుడ్‌ ప్రముఖులు హాజరయ్యారు. అలాగే ప్రియాంక చోప్రా అన్ని దగ్గరుండి చూసుకుంది. సానియా మీర్జా సైతం అన్నీ తానై వ్యవహరించడం విశేషం. 
Parineeti Chopra, Raghav Chadha
Parineeti Chopra, Raghav Chadha
 
రాఘవ్‌, పరిణీతి ఒకే స్కూల్‌ చదువుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో హీరోయిన్‌ పరిణీతి రాణిస్తుంది. మరోవైపు రాఘవ్‌ చద్దా యువ ఎంపీగా రాజకీయాల్లో రాణిస్తున్నారు.

Parineeti Chopra, Raghav Chadha
Parineeti Chopra, Raghav Chadha