శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 మార్చి 2021 (14:32 IST)

ఆ బేకరీలో కేకులు కొంటే పెట్రోల్ ఫ్రీ.. ఎక్కడ?

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ బేకరీ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమిళనాడు, తిరుచ్చిలోని ఓ బేకరీ తమ షాపులో కేక్ కొంటే పెట్రోల్ ఉచితం అంటూ ప్రకటించింది. అంతే ఆ షాపుకు జనం పెద్ద ఎత్తున చేరారు. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రూ.100లకు చేరిన తరుణంలో.. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగతున్నాయి. 
 
ఇలాంటి పరిస్థితుల్లో తిరుచ్చికి చెందిన బేకరీలో రూ.600 నుంచి రూ.1500 వరకు కేక్‌లను కొనుగోలు చేసిన వారికి ఒక లీటర్ పెట్రోల్ ఉచితంగా అందించడం జరిగింది. కేకులు కొనేవారికి టోకెన్లు ఇస్తున్నారు. ఈ టోకెన్ల ద్వారా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ వాహనాలలో నింపుకోవచ్చు. ఈ ఆఫర్‌కు ప్రజలు భారీ ఎత్తున ఆకర్షితులవుతున్నారు.