హెయిర్ కట్ - గడ్డం - మీసాలు ట్రిమ్ : న్యూ లుక్‌లో రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ న్యూ లుక్‌లో కనిపిస్తున్నారు. భారత్ జోడో యాత్రలో గుబురు గడ్డంతో కనిపించిన ఆయన.. ఇపుడు హెయిర్ కట్, గడ్డం, మీసాలు ట్రిమ్ చేయించా న్యూ లుక్‌లో కనిపిస్తున్నారు. వారం రోజుల పర్యటన నిమిత్తం ఆయన బ్రిటన్ చేరుకున్నారు. అక్కడ ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఇందుకోసం ఆయన కొత్త గెటప్‌లో కనిపించారు.
సాధారణంగా రాహుల్ గాంధీ క్లీన్ షేవ్ చేసుకుంటారు. అయితే, ఆయనకు కొంచెం మీసాలు, గడ్డం ఉంచుకోవడంతో సరికొత్తగా కనిపిస్తున్నారు. భారత్ జోడో యాత్రలో తెల్లటి టీషర్ట్, ప్యాంట్‌నే ధరించిన ఆయన ఇపుడు సూటు, కోటు ధరించి కేంబ్రిడ్జిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. 21వ శతాబ్దంలో వినడాన్ని నేర్చుకోవడం అనే అంశంపై ఆయన ప్రసంగిస్తారని యూత్ కాంగ్రెస్ ఓ ట్వీట్ చేసింది. అలాగే, రాహుల్ గాంధీ కొత్త లుక్ ఫోటోను కూడా షేర్ చేసింది.