సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 1 ఏప్రియల్ 2018 (14:46 IST)

పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి ... చదవలేదు.. పాస్ చేయండి ప్లీజ్ : ఓ విద్యార్థి వేడుకోలు

పబ్లిక్ పక్షలు రాసిన ఓ విద్యార్థి జవాబు పత్రంలో ప్రశ్నలకు బదులు తన ప్రేమ లేఖ రాశాడు. తాను ఇష్టపడిన పూజతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన కారణంగా చదవలేక పోయానని అందువల్ల తనను పాస్ చేయాల్సిందిగా ఆ విద్యార

పబ్లిక్ పక్షలు రాసిన ఓ విద్యార్థి జవాబు పత్రంలో ప్రశ్నలకు బదులు తన ప్రేమ లేఖ రాశాడు. తాను ఇష్టపడిన పూజతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన కారణంగా చదవలేక పోయానని అందువల్ల తనను పాస్ చేయాల్సిందిగా ఆ విద్యార్థి ఆన్సర్ షీటులో రాశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఆసక్తికర విషయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. 
 
ఇటీవలే ఉత్తరప్రదేశ్ బోర్డు ఇంటర్నీడియట్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు హాజరైన ఓ విద్యార్థి జవాబు పత్రంపై వింత రాతలు రాశాడు. ప్రేమలో పడి చదవలేకపోయానని, తనను పాస్ చేయాలని రాసి అందర్నీ అవాక్కయ్యేలా చేశాడు. "ఐ లవ్ మై పూజ" అంటూ ఆ విద్యార్థి ధైర్యంగా తన కెమిస్ట్రీ పరీక్ష జవాబు పత్రంపై రాశాడు.
 
'ఈ ప్రేమ చాలా చిత్రమైనది. ఇది బతకనీయదు... చావనీయదు. ఈ ప్రేమకథ వల్ల పరీక్షలకు నేను సన్నద్ధం కాలేకపోయాను.... నన్ను మీరే పాస్ చేయాలి' అంటూ ఆ విద్యార్థి రాశాడు. జవాబు పత్రంలో తన ప్రేమ రామాయణం, లవ్ సింబల్ తప్ప మిగిలిందంతా ఖాళీగా విడిచిపెట్టాడు. 
 
దీనిపై ముజఫర్‌నగర్ జిల్లా పాఠశాలల తనిఖీ అధికారి మునేశ్ కుమార్ మాట్లాడుతూ... విద్యార్థులు తమ జవాబు పత్రాలతో పాటు కరెన్సీ నోట్లను జత చేస్తున్నారు. కొన్ని వినతిపూర్వకమైన సందేశాలను కూడా రాస్తున్నారని ఆయన చెప్పారు.