మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శనివారం, 31 మార్చి 2018 (10:25 IST)

ఎస్పీ - బీఎస్పీ పొత్తు ఎఫెక్టు : ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి నష్టం

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అపార నష్టం వాటిల్లనుంది. ఈ పొత్తు కారణంగా బీజేపీకి ఏకంగా 30 నుంచి 40 ఎంపీ సీట్లను కోల్పోనుందట. ఈ విషయాన్ని ఎన్డీయే కీలక భాగస్వా

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అపార నష్టం వాటిల్లనుంది. ఈ పొత్తు కారణంగా బీజేపీకి ఏకంగా 30 నుంచి 40 ఎంపీ సీట్లను కోల్పోనుందట. ఈ విషయాన్ని ఎన్డీయే కీలక భాగస్వామి, ఆర్పీఐ అధ్యక్షుడు, కేంద్రమంత్రి రామ్‌దాస్‌ అథవాలే వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఎస్పీ-బీఎస్పీ పొత్తు వల్ల వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో యూపీలో బీజేపీకి 25 నుంచి 30 సీట్లు తగ్గే అవకాశం ఉందన్నారు. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సవాలు చేసే సత్తా.. కాంగ్రెస్‌కు గానీ, రాహుల్‌ గాంధీకి గానీ, ఎస్సీ, బీఎస్పీలకు గానీ లేదన్నారు. 
 
2019 ఎన్నికల్లో యూపీలో బీజేపీకి 50కి పైగా ఎంపీ సీట్లు వస్తాయని, ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఇదేమీ ప్రతిబంధకం కాదని అథవాలే అన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీకి యూపీలో 73 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీ.. రాయ్‌బరేలీ, అమేథీలకే పరిమితం కాగా.. సమాజ్‌వాదీ పార్టీకి ఐదు సీట్లు వచ్చాయి. ఇటీవల ఫుల్‌పూర్‌, గోరఖ్‌పూర్‌ లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీఎస్పీ మద్దతుతో గెలిచిన ఎస్పీ తన స్థానాల సంఖ్యను ఏడుకు పెంచుకుంది.