శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 29 మార్చి 2018 (11:28 IST)

రేపిస్టులను బహిరంగంగా కాల్చిపారేయాలి : బీజేపీ ఎంపీ

భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ రాంప్రసాద్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాలకు పాల్పడే వారిని బహిరంగంగా నిలబెట్టిన కాల్చిపారేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈయన తేజ్‌పూర్ స్థానం నుంచి ఎంపీగా ప్రాతిని

భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ రాంప్రసాద్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాలకు పాల్పడే వారిని బహిరంగంగా నిలబెట్టిన కాల్చిపారేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈయన తేజ్‌పూర్ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, అత్యాచారంలాంటి హేయమైన నేరాలకు పాల్పడే వారిని బహిరంగంగా కాల్చేయాలి లేదా ఉరేయాలి. ఇలాంటి దారుణ ఘటనలకు ముగింపు పలకడానికి ఇదే ఏకైక మార్గం. మహిళలకు గౌరవం ఇవ్వని వారి పట్ల ఇలాగే వ్యవహరించాలి అంటూ పిలుపునిచ్చారు. 
 
అంతేకాక మహిళలపై దాడులు చేసినా, వేధింపులకు పాల్పడినా, వారిని ఉద్దేశపూర్వకంగా తాకినా అలాంటి మృగాలకు కనీసం పదేళ్ల జైలుశిక్షను విధించాలన్నారు. రేపిస్టులను అంతమొందించడానికి షూటింగ్ బృందాలను కూడా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. 
 
ఇటీవల అసోంలోని నాగావో జిల్లాలో గతవారం ఓ మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసి హతమార్చిన నేపథ్యంలో శర్మ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రేపిస్టుల్లో ఇద్దరు మైనర్లు కావడం గమనార్హం.