శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 14 మార్చి 2018 (13:49 IST)

15న బంధన్ బ్యాంకు పబ్లిక్ ఇష్యూ

దేశంలో ఉన్న ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన బంధన్ బ్యాంకు బుధవారం తన పబ్లిక్ ఇష్యూను జారీచేయనుంది. ఇందులోభాగంగా, 10 రూపాయల ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్‌ను రూ.370 నుంచి రూ.375కు మధ్య (ఒక్కో ఈక్విటీ షేర్ ధర)

దేశంలో ఉన్న ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన బంధన్ బ్యాంకు బుధవారం తన పబ్లిక్ ఇష్యూను జారీచేయనుంది. ఇందులోభాగంగా, 10 రూపాయల ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్‌ను రూ.370 నుంచి రూ.375కు మధ్య (ఒక్కో ఈక్విటీ షేర్ ధర) విక్రయించనుంది. ఈ పబ్లిక్ ఇష్యూ ఈనెల 19వ తేదీతో ముగుస్తుంది. ఒక్కో షేర్ హోల్డర్ కనీసం 40 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 
 
ఈ ఇష్యూలో మొత్తం 119,280,494 ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. ఇందులో 97,663,610 షేర్లను ఫ్రెష్ ఇష్యూ కింద, 14,050,780 షేర్లను ఐఎఫ్సీ ద్వారా, 7,565,804 షేర్లను ఐఎఫ్సీ ఎఫ్ఐజీ ద్వారా విక్రయించనున్నారు.

ఈ బ్యాంకు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 887 శాఖలను కలిగివుండగా, తమిళనాడులో 16 బ్రాంచీలు ఉన్నాయి.  బ్యాంకులో 270 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉండగా, 30 శాతం ఖాతాదారులు సీనియర్ సిటిజన్లే కావడం గమనార్హం. 

ఇదిలావుంటే, దేశంలో బంధన్ బ్యాంకు కార్యకలాపాలు గత 2015 ఆగస్టు నెలలో ప్రారంభమయ్యాయి. యూనివర్శల్ బ్యాంకింగ్ లైసెన్సును పొందిన తొలి మైక్రోఫైనాన్స్ ఆర్థిక సంస్థగా బంధన్ బ్యాంకు రికార్డు సృష్టించింది. 
 
కాగా, భారత రిజర్వు బ్యాంకు నిబంధనల మేరకు బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభమైన మూడేళ్ళలోపు పబ్లిక్ ఇష్యూకు జారీచేయాల్సి ఉందని అందుకే తొలిసారి పబ్లిక్ ఇష్యూను జారీ చేస్తున్నట్టు ఆ బ్యాంకు ఎండీ, సీఈవో చంద్రశేఖర్ ఘోష్, సీఎఫ్ఓ సునీల్ సందానీలు మంగళవారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.