ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం : స్లీపర్ బస్సులో బాలికపై అత్యాచారం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. స్లీపర్ బస్సులో 15 యేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. మార్గమధ్యంలో బస్సు ఆగినపుడు ఈ దారుణం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
యూపీకి చెందిన 15 ఏళ్ల బాలిక తన తల్లి, కుటుంబసభ్యులతో బదర్‌పుర్ నుంచి ఔరియా వెళ్లేందుకు సోమవారం రాత్రి 11 గంటలకు స్లీపర్ బస్సు ఎక్కింది. మార్గమధ్యంలో బస్సు ఆగినప్పుడు ఆమె కుటుంబ సభ్యులు, ఇతర ప్రయాణికులు కిందకు దిగారు.
ఆ సమయంలో కండక్టర్ బబ్లూ సహచరుడు అషులు కలిసి బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ ఘోరాన్ని ఆమె తన తల్లికి వివరించింది. బస్సును ఆపేందుకు తల్లి ప్రయత్నించగా బబ్లూ ఆమెను లాగి పడేశాడు.
అనంతరం బబ్లూ, అషు బస్సు దిగి వెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై శిఖోహాబాద్ పోలీసు స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అషు అనే నిందితుడి అరెస్టు చేయగా, పరారీలో ఉన్న బబ్లూ కోసం గాలిస్తున్నారు.