మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 జులై 2021 (20:37 IST)

జనాభా నియంత్రణకు కొత్త చట్టం: యూపీలో ఇద్దరంటే ఇద్దరే వుండాలి.. లేకుంటే?

ప్రపంచంలో జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. మన దేశంలో దాదాపు 136 కోట్ల జనాభా ఉంది. ఇందులో యూపీ రాష్ట్రంలోనే రూ.20 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఇంకా ఆ సంఖ్య పెరుగూతనే ఉంది. ఈ క్రమంలో జనాభా నియంత్రణకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కొత్త చట్టం రూపొందిస్తోంది. 

2021ను యూపీ లా కమిషన్ విడుదల చేసింది. ఈ ముసాయిదా చట్టం ప్రకారం.. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు. ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి చేకూరదు. ఏ సంక్షేమ పథకమూ వర్తించదు. అంతేకాదు స్థానిక ఎన్నికల్లో చేసే అర్హత కూడా ఉండదు.
 
ఈ ముసాయిదా చట్టం ప్రకారం.. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారికి ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే.. వారికి భవిష్యత్‌లో ప్రమోషన్‌లు ఇవ్వరు. ఇంట్లో ఎంత మంది ఉన్నా నలుగురి కంటే ఎక్కువ మందికి రేషన్ ఇవ్వరు. రేషన్ కార్డులో నలుగురు మాత్రమే ఉండేలా నిబంధనలను మార్చనున్నారు. ఇక ఇద్దరి కంటే తక్కువ మంది పిల్లలున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుంది. 
 
ఇద్దరు సంతానం పాటించే ప్రభుత్వ ఉద్యోగులకు రెండుసార్లు అదనంగా ఇంక్రిమెంట్ ఉంటుంది. ప్లాట్ లేదా ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటే సబ్సిడీ ఇస్తారు. ఒక ఒక్కరే సంతానం ఉంటే మరిన్ని అదనపు ప్రోత్సాహకాలు అందుతాయి. ఒక్క సంతానమే ఉన్నఉద్యోగులకు  నాలుగు అదనపు ఇంక్రిమెంట్లు ఇస్తారు. పిల్లలకు 20 ఏళ్లు వచ్చే వరకు ఉచిత విద్య, వైద్యాన్ని అందజేస్తారు.
 
యూపీ జనాభా బిల్లు 2021ని లా కమిషన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. ఆదివారం సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారికంగా విడుదల చేయనున్నారు. దీనిపై జులై 19 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. అందులో ఏవైనా ముఖ్యమైన అంశాలు ఉంటే బిల్లులో మార్పులు చేస్తారు. అనంతరం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదముద్రవేయాలని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ భావిస్తోంది. అనంతరం చట్టం అమల్లోకి వస్తుంది.